ఆత్మహత్య ఆలోచనలు వేధించాయి.. సమస్యలు ఏకరువు పెట్టిన షణ్ముఖ్ జస్వంత్

  • మానసిక సమస్య గంటల్లో తీరిపోయేది కాదన్న యూట్యూబ్‌ స్టార్
  • సమస్యలను ఎదుర్కొంటేనే మనకు కావాల్సింది దొరుకుతుందని వ్యాఖ్య
  • తన అనుభవంలో ఇవన్నీ అర్థం చేసుకున్నానన్న షణ్ముఖ్ 
యూట్యూబ్ స్టార్, రియాలిటీ షో బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ ఎన్నోసార్లు ఆత్మహత్యకు యత్నించాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. దీప్తితో బ్రేకప్, డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా చిక్కుల్లో పడి చాలాకాలంపాటు అభిమానులకు దూరంగా ఉండిపోయిన షణ్ముఖ్.. తాజాగా తాను ఎదుర్కొన్న కష్టాలు, వేధించిన ఆలోచనల గురించి ఇన్‌స్టా స్టోరీలో వెల్లడించాడు.

మానసిక ఒత్తిడి అనే సమస్య గంటలు, రోజుల్లో తీరిపోయేది కాదని, అది చాలాకాలం పాటు వేధిస్తుందని షణ్ముఖ్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చాయని చెప్పుకొచ్చాడు. సమస్యలు ఎన్ని వేధించినా ప్రతిసారీ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నానని,  ఒకసారి మనం ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రపంచంలో మన కుటుంబం తప్ప మరెవరూ పట్టించుకోరని పేర్కొన్నాడు.

ఏదైనా సమస్య ఉంటే దానిని ధైర్యంగా ఎదుర్కోవాలని షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు. దేవుడు కష్టాలు పెట్టి పరీక్షిస్తూనే ఉంటాడని, ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటేనే మనకు కావాల్సింది దొరుకుతుందని చెప్పుకొచ్చాడు. తన అనుభవంలో ఇవన్నీ అర్థం చేసుకున్నానని, మీరు స్ట్రాంగ్ కాబట్టి ఏదైనా చేయగలరని పేర్కొన్నాడు.

Shanmukh Jaswanth
YouTube
Bigg Boss

More Telugu News